![]() |
![]() |
.webp)
సౌందర్య అంటే చాలు తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది. ఆమె నటన పొందికైన చీర కట్టినట్టు ఉంటుంది. అలంటి సౌందర్య మనకు దూరమై చాలా ఏళ్ళే ఐపోతోంది. ఆ తర్వాత ఇప్పుడు బుల్లితెర మీదకు జూనియర్ సౌందర్య అని నెటిజన్స్ తో పిలిపించుకుంటున్న సౌమ్య వచ్చింది. సౌమ్య జబర్దస్త్ షోకి కొంతకాలం యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత ఆమె మాట్లాడే తెలుగు కారణంగా ఆమెను తీసేసారు. ఇక ఇప్పుడు పట్టుబట్టి తాను కన్నడ అమ్మాయి ఐనా కూడా తెలుగు నేర్చుకుని తెలుగు షోస్ లో చేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఇంకా కొన్ని షోస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పింక్ శారీ వేసుకుని సముద్రం దగ్గర నిలబడి దేవర సాంగ్ కి డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "చీరను క్యారీ చేయడం కంటే డాన్స్ చేయడం చాలా ఈజీ" అంటూ కాప్షన్ పెట్టింది.
.webp)
ఇక ఈ పింక్ డాల్ డాన్స్ కి నెటిజన్స్ ఫిదా ఐపోతున్నారు. "అంతఃపురం మూవీలో సౌందర్యను గుర్తు చేశారు..అచ్చం సౌందర్యలా ఉన్నారు. బ్యూటిఫుల్ గా ఉన్నారు..అందంగా డాన్స్ చేశారు. సోమ్య గారు మీరు సేమియా లాగా ఉన్నారు. హీరోయిన్ మెటీరియల్..అందమైన అమ్మాయికి చీర చాలా అందంగా ఉంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతఃపురం మూవీలో సౌందర్య నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులో సౌందర్య నటనకు పోటీగా జగపతి బాబు, ప్రకాష్ రాజ్ నటన ఇంకా హైలైట్ గా ఉంటుంది. సినీ ఇండస్ట్రీని ఏలింది సౌందర్య. ఏ స్టార్ హీరో పక్కనైనా సౌందర్య హీరోయిన్ గా నటించేది . స్టార్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసిన సౌందర్య ఎంతోమందికి ఫెవరెట్ హీరోయిన్ కూడా. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకున్నారు ... తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సౌందర్య.
![]() |
![]() |